సస్పెన్షన్ తర్వాత పశ్చాత్తాపం: వైరలైన ఆర్టీసీ డ్రైవర్ వీడియో
- సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్
- నిర్లక్ష్యంపై స్పందించిన అధికారులు.. డ్రైవర్‌పై సస్పెన్షన్ వేటు
- సస్పెన్షన్ తర్వాత కన్నీళ్లతో క్షమాపణ కోరుతూ వీడియో విడుదల
- పిల్లల అనారోగ్యం వల్లే మాట్లాడానని, తనపై కక్ష సాధించారని ఆవేదన
- డ్రైవర్‌పై చర్యల విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు
సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సు నడిపి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడాడన్న ఆరోపణలతో సస్పెండైన ఆర్టీసీ డ్రైవర్ కేవీ రావు, ఇప్పుడు పశ్చాత్తాపంతో కన్నీరు పెట్టుకున్నారు. "తప్పు నాదే, నన్ను క్షమించండి" అంటూ ఆయన విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కృష్ణా జిల్లా కోడూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఏపీ16టీజే 0616 నంబరు గల ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ కేవీ రావు గంటపాటు ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా బస్సు నడిపారు. కండక్టర్ వై.ఎల్. బాబు, ప్రయాణికులు వారించినా ఆయన వినలేదు. దీంతో భయపడిన కొందరు ప్రయాణికులు కంకిపాడు వద్ద బస్సు దిగిపోయారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ అనంతరం డ్రైవర్ కేవీ రావు ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
"నేను విజయవాడ నుంచి కోడూరు ఉదయం 6 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 1:50 నిమిషాలకు విజయవాడ చేరుకునే బస్సుకు డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నాను. నేను ఫోన్ మాట్లాడింది మా ఇంటి వాళ్లతోనే. మా పిల్లలకు ఆరోగ్యం సరిగా లేదని నాలుగైదు సార్లు చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేయవలసి వచ్చింది. రెండు నిమిషాలు మాట్లాడిన అనంతరం ఫోన్ పక్కనపెట్టేశాను. కొందరు ఉద్దేశపూర్వకంగానే నాపై కక్ష సాధింపుతో ఆ వీడియోను వైరల్ చేశారు. చేసిన పొరపాటును మన్నించి మరలా నన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటా" అని కేవీ రావు విన్నవించుకున్నారు.
ఈ వీడియోతో డ్రైవర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ పరిస్థితిని చూసి అవకాశం ఇవ్వాలని కొందరు అంటుండగా, ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేసినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.